మియాపూర్ గుర్నాథ్ చెరువు పరిరక్షణ కోసం స్థానికులు 'మన ఊరు-మన చెరువు అనే కార్యక్రమం చేపట్టారు. చెరువులో చెత్త, పూజా సామగ్రి వేయొద్దని ప్లకార్డులు పట్టుకొని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. చెరువును పరిరక్షిద్దాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.