కనిగిరి: డీజీ పేటలో దారుణం, వృద్ధురాలిపై కత్తితో దాడి చేసి, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు, వృద్ధురాలు మృతి
చంద్రశేఖరపురం మండలంలోని డీజీ పేట గ్రామంలో గురువారం దారుణం చోటు చేసుకుంది. పొలంలో గడ్డి కోసుకొని ఇంటికి వస్తున్న పావలి వెంకటసుబ్బమ్మ అనే వృద్ధురాలిపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి, ఆమె మెడలోని బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న వృద్ధుడాలని వైద్యశాలకు స్థానికులు తరలించగా, అప్పటికే వృద్ధురాలు మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సీఐ శ్రీనివాసులు దర్యాప్తు చేపట్టారు.