బుగ్గారం: డాక్టరేట్ అందుకున్న జగిత్యాల యువకుడు అరికెల జగన్
కాకతీయ విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవంలో జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం శకల్ల గ్రామానికి చెందిన అరికెల జగన్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఆయన ఈ పట్టాను స్వీకరించారు. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధిపై ఆయన పరిశోధన చేశారు.