కొత్తగూడెం: ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించండి: స్పెషల్ డిప్యూటీ కలెక్టర్
భద్రాద్రి జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. వెంకట రావు పాల్గొన్నారు. ప్రజల వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.