కురవి: యాసంగిలో వరి వద్దు.. ఆరుతడి పంటలే ముద్దు: ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి పిలుపు
రసాయన మందుల వాడకాన్ని తగ్గించి, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి రైతులకు సూచించారు. సూపర్ ఎల్ నినో, విద్యుత్ కొరత దృష్ట్యా యాసంగిలో వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను ఎంచుకోవాలని ఆయన కోరారు.