రఘునాథపాలెం: ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ప్రజా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఎదులాపురం మున్సిపాలిటీ వేదికగా ఆయన మాట్లాడుతూ, పేదవారి సంక్షేమమే తమ ధ్యేయమని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.