ఉరవకొండ: బెలుగుప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభయాన్ పథకంతో గర్భిణీలకు వైద్య పరీక్షలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభయాన పథకం భాగంగా మంగళవారం వైద్యాధికారిణి హిమబిందు ఆధ్వర్యంలో గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రతినెల హైరిస్క్ గర్భవతులను గుర్తించి, పరీక్షించి వారికి రక్త శాతం, BP పరీక్షలు చేయడం, అంగన్వాడి కేంద్రంలో ఇచ్చు పౌష్టికాహారం, మంచి ఆకుకూరలు తీసుకోవాలని ఆరోగ్య సలహాలు తెలపడం జరిగినది.వంద మంది గర్భవతులకు దాత పాటిల్ కొండారెడ్డి తండ్రి జ్ఞాపకార్థం ఉచిత భోజనము ప్రతినెల ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్స్ వెంకటరమణ, సీహెచ్ఓ పద్మావతి, పిహెచ్ఎన్ సరోజ, నాగమణి పాల్గొన్నారు.