మరిపెడ: అమెరికా రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మహిళ మృతి
అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన దారం సుప్రజ మరణించారు. రెస్టారెంట్ మూసివేసి ఇంటికి వెళ్తుండగా ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సుప్రజ స్నేహితురాలికి తీవ్ర గాయాలయ్యాయి.