ఆత్మకూరు ఎం: ఆత్మకూరు మండలంలో రేపు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. 23 గ్రామాలకు 23 కౌంటర్లు!
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో రేపు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా కార్డులను అందించనున్నారు. మొత్తం 23 గ్రామాలకు 23 కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అర్హులు సకాలంలో హాజరు కావాలని సూచన.