ఆత్మకూరు ఎం: మండల శివారులోని వ్యవసాయ బావిలో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుని మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండల శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. మృతురాలి బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లాకు చెందిన సంధ్యను ఆత్మకూరు మండలం, మొరిపిరాల గ్రామానికి చెందిన కృష్ణకు గ తేడా అది వివాహం జరిగింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో మృతురాలి భర్త కృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో దొంగతనం చేసిందని సంధ్య పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు వేధించారని సూసైడ్ లెటర్ రాసి నేడు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టంకు తరలించారు.