ఆత్మకూరు ఎం: అధికారులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక పర్మిషన్ తో పాటు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలి: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ లో పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత పది ఏళ్ల కాలంగా సొంత ఇంటి కోసం ఎదురుచూసిన పేదలకు పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. సకాలంలో ఇల్లు పూర్తి చేసిన వారికి బిల్లులు చెల్లించే విధంగా చర్యలు చేపడతామన్నారు. అధికారులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక పరిమిషన్ తో పాటు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు.