ఆత్మకూరు ఎం: పోసానికుంటలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన మదర్ డైరీ మాజీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన MLA బీర్ల
యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు ఎం మండల పరిధిలోని తుక్కపురం పోసానికుంట గ్రామంలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన మదర్ డైరీ మాజీ డైరెక్టర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సామ సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని బుధవారం మధ్యాహ్నం తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా వారు విద్యుత్ షాక్ తగిలిన తీరును వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మీ కుటుంబానికి మనోధైర్యాన్ని నింపి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.