రామచంద్రపురం: ఉత్తమ స్వచ్ఛ NGOగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్: దక్కిన అరుదైన పురస్కారం!
సత్యం వాసంశెట్టి ఫౌండేషన్‌కు ఉత్తమ స్వచ్ఛ NGO అవార్డు లభించింది. కలెక్టర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా చైర్మన్ వాసంశెట్టి సత్యం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. విద్య, ఉపాధి, మహిళా సాధికారత, పారిశుద్ధ్యం వంటి రంగాల్లో ఫౌండేషన్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.