సంగారెడ్డి: పోలీస్ బ్యాడ్మింటన్ మీట్: సత్తా చాటిన సంగారెడ్డి జిల్లా పోలీసులు
తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన 5వ బ్యాడ్మింటన్ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో సంగారెడ్డి జిల్లా సిబ్బంది ప్రతిభ కనబరిచారు. హెడ్ కానిస్టేబుల్ సజీవ్ స్వర్ణం, శ్రావ్య మరియు ధరణి కాంస్య పతకాలను గెలుచుకున్నారు. విజేతలను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారు.