సంగారెడ్డి: తెలంగాణ పోలీస్ బ్యాడ్మింటన్ మీట్: మెరిసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు
తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన 5వ బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ మీట్లో సంగారెడ్డి జిల్లా సిబ్బంది ప్రతిభ కనబరిచారు. హెడ్ కానిస్టేబుల్ ఈ.డి. సజీవ్ స్వర్ణం సాధించగా, శ్రావ్య, ధరణిలు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. వీరిని ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారు.