ఉరవకొండ: దేశంలో మార్పు రావాలి.. మార్పు కావాలి అనే నినాదంతో సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు జీపు జాత చేపట్టిన సీపీఐ
దేశంలో మార్పు రావాలి.. మార్పు కావాలి అనే నినాదంతో సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ ఆగస్టు 1 నుంచి 15 వరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సీపీఐ పోరుబాటలో భాగంగా శనివారం అనంతపురం జిల్లా ఉరవకొండకు జీపు జాత చేరుకుంది. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉరవకొండ సీపీఐ పార్టీ నియోజకవర్గ సహాయ కార్యదర్శి సుల్తాన్ అధ్యక్షతన స్థానిక టవర్ క్లాక్ సమీపంలో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, జిల్లా సహాయ కార్యదర్శిలు మల్లికార్జున, రాజారెడ్డి, కేశవ రెడ్డి