రఘునాథపాలెం: ప్రభుత్వంపై విష ప్రచారం: విపక్షాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం
ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఎదులాపురం మున్సిపాలిటీలో మాట్లాడుతూ, పేదల సంక్షేమమే తమ ధ్యేయమని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.