రాప్తాడు: కురుబ ఒకే కులం ఒకే అధ్యక్షుడు ఉండాలి అనంతపురంలో రాప్తాడు నియోజకవర్గం కురుబ సంఘం నేత బండి పరశురాం పిలుపు
అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం 11:30 గంటల సమయంలో అనంతపురం జిల్లా కురబ కురువ సంఘం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు కురుబ సంఘం నేత బండి పరశురామ్ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురుబ కులస్తులంతా కలిసి ఉండాలని కురుబ సంఘానికి కూడా ఒకే అధ్యక్షుడు ఉండేలాగా కురుబ నాయకులంతా చర్చించుకుని ఒక అధ్యక్షుడు ఉండే విధంగా చూడాలని అలా కాకుండా ఇద్దరు ముగ్గుల అధ్యక్షులు అని చెప్పుకుంటే కురుబ యువకులుగా తామంతా చూస్తూ ఊరుకునేది ప్రసక్తే లేదని ఒకే కులం ఒకే అధ్యక్షుడు ఉండే విధంగా కురుబ నాయకులు నిర్ణయించుకోవాలని రాప్తాడు కురుబ సంఘం నేత పరశురాం కులస్తులను కోరాడు.