ఉరవకొండ: రాగులపాడు వద్ద హంద్రీనీవా లిఫ్ట్ వద్ద పది పంపులతో కృష్ణాజిల్లాల ఎత్తిపోతలతో 3020 క్యూసెక్కుల నీరు విడుదల
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల పరిధిలోని రాగులపాడు వద్ద ఉన్న హంద్రీనీవా కాలువ వద్ద బుధవారం ఏకంగా 10 పంపులతో సుమారు 3020 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోతలు చేయడంతో బెలుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ కు కృష్ణా జలాలు హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చి చేరుతున్నాయి. రాగులపాడు వద్ద నున్న ఎనిమిదో లిఫ్ట్ నుండి ఒక పంపుతో మొదలుపెట్టి ఏకంగా 10 పంపులతో కృష్ణా జలాల ఎత్తిపోతలు జరుగుతున్నాయని హంద్రీ నీవా అధికారులు పేర్కొన్నారు.