నారాయణపేట్: నారాయణపేట: మద్దూరులో గురుకుల పాఠశాల, డిగ్రీ కళాశాల నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష
నారాయణపేట జిల్లా మద్దూరులో రూ.30 కోట్లతో నిర్మిస్తున్న గురుకుల పాఠశాల, రూ.6.10 కోట్లతో చేపట్టిన డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ప్రియాంక పరిశీలించారు. నవంబర్ లోపు పనులు పూర్తి చేసి మార్చి నాటికి పాఠశాలను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.