సంతనూతలపాడు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉప్పుగుండూరులో జాతీయ జెండాలతో విద్యార్థుల భారీ ర్యాలీ
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పుగుండూరులో జాతీయ జెండాలను చేత బూని విద్యార్థులు భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఈ ర్యాలీ కార్యక్రమం కొనసాగింది. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగదనుల పోరాటాలను విద్యార్థులకు తెలియజేసేందుకు ఇటువంటి ర్యాలీ కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఉపాధ్యాయులు అన్నారు.