ఉరవకొండ: బెలుగుప్ప శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో వరుణుడి కరుణ కోసం వరుణ యాగం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం వరుణుడి కరుణ కోసం వరుణ యాగాన్ని వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో బెళుగుప్ప గ్రామ ప్రజలు, రైతులు కలసి వేద పండితులతో నిర్వహింప చేశారు. ప్రముఖ వేద పండితులు యాగాల నిష్ణాతులు అయిన శ్రీ సుంకేసుల సత్యనారాయణ రావు బృందంతో 11 మంది వేద పండితులు వరుణ యాగము వరుణ జపములను ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు. కరువు ప్రాంతాన్ని జలముతో జయించడమే వరుణ యాగఫలమని వేద పండితులు సత్యనారాయణరావు పేర్కొన్నారు.