వలిగొండ: యాదాద్రి భువనగిరి: NH 930పై ఘోర ప్రమాదం.. 10 గొర్రెలు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సాయిగూడెం వద్ద జాతీయ రహదారి 930పై గుర్తుతెలియని వాహనం గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 గొర్రెలు చనిపోగా, సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లింది. రహదారిపై అతివేగం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.