వలిగొండ: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి జిల్లా: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను అకస్మికంగా తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్ని ఎరువులను యూరియాను అందుబాటులో ఉంచాయని యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దన్నారు. గత సంవత్సరం మాదిరిగానే 17,000 మెట్రిక్ టండ్ల యూరియాను రైతుల కోసం సరఫరా చేయడం జరిగిందన్నారు. రైతులు అవసరమైన మేరకే యూరియాను తీసుకువెళ్లాలని అన్నారు.