వలిగొండ: గోకారం నేలపట్ల రోడ్డు మరమ్మతులు చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని గోకారం నేలపట్ల రోడ్డు మరమ్మతులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బ తినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్యను పరిష్కరించడానికి ఎమ్మెల్యే వెంటనే చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు రాజయ్య సురేందర్ మల్లయ్య వెంకటయ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు.