వలిగొండ: వలిగొండ పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించిన బిసీ సంక్షేమ సంఘం నాయకులు
యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలిసారిగా మంత్రి పదవిని త్యాగం చేసిన మహానేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాదగిరి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వలిగొండ పద్మశాలి భవన్ లో వలిగొండ పద్మశాలి సంఘం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు పద్మశాలిల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు .నేటి తరం కొండ లక్ష్మణ్ బాపూజీ చరిత్రను అధ్యయనం చేయాలన్నారు.