చిత్తూరు: చిత్తూరులో 19 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ: ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తన కార్యాలయంలో 19 మంది లబ్ధిదారులకు రూ.9,37,553 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆపద సమయంలో అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.