కనిగిరి: పట్టణంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా టీడీపీ ఆధ్వర్యంలో భారీ మోటర్ బైక్ ర్యాలీ
కనిగిరి పట్టణంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గురువారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ మోటర్ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ టిడిపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ఆధ్వర్యంలో యువత, టిడిపి నాయకులు, కార్యకర్తలు మోటార్ బైకులతో పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద నుండి ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేశారు. దేశభక్తిని పెంపొందించే విధంగా జాతీయ జెండాలను చేత బూని బైకులపై టిడిపి శ్రేణులు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.