ఉరవకొండ: మంత్రిగారి ఇలాకాలో బీసీలకు రక్షణ లేదన్న వైస్సార్సీపీ బీసీ సెల్ విభాగం నాయకులు
మంత్రిగారి ఇలాకాలో బీసీలకు రక్షణ లేదని బీసీలపై దౌర్జన్యాలు అక్రమ కేసులు భూ అక్రమాలకు వ్యతిరేకంగా గురువారం బీసీ నాయకులు ఎంపీపీ నరసింహులు, డిష్ సురేష్ ప్రసాద్, జోగి వెంకటేశులు తదితర నాయకులు కలిసి అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని వైయస్సార్సీపి పార్టీ ఆఫీసు నందు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో బీసీ ల పై ఒక దుర్మార్గ పాలన కొనసాగుతుంది. రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామస్థాయి వైస్సార్సీపీ బీసీ కార్యకర్త నుంచి మాజీ మంత్రులపై సైతం కేసులు బనాయిస్తున్నారన్నారు.