బుగ్గారం: జగిత్యాల: బుగ్గారం పోలీస్ స్టేషన్లో ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ
జగిత్యాల జిల్లా బుగ్గారం పోలీస్ స్టేషన్ను ఎస్పీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతిని పరిశీలించిన ఎస్పీ, నేరాల నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రజలతో మమేకం కావడంతో పాటు విధి నిర్వహణలో అనుసరించాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.