ఉరవకొండ: పట్టణంలో ప్రసిద్ధిగాంచిన హజరత్ బిబి జైనబ్బి అమ్మవారి ఉత్సవాలు గంధం వేడుకలతో ప్రారంభం
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన హజరత్ బిబి జైనబ్బి అమ్మవారి దర్గా హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుంది. జైన బీమాత ఉత్సవాలు బుధవారం రాత్రి గంధం వేడుకలతో ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలోని ఏకైక అమ్మవారి దర్గా కావడం తో వివిధ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. జైనబ్బీ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 13న ఉరుసు 14న జియారత్ 14న ప్రపంచ ప్రఖ్యాత గంచిన ఖవ్వాలి పోటీదారులతో పోటీలు ఉంటాయని జైనబ్బీ దర్గా కమిటీ అధ్యక్షుడు హోతూరు భాష పేర్కొన్నారు.