నస్పూర్: మంచిర్యాల: 30వ డివిజన్లో 26న కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ 30వ డివిజన్లో ఈ నెల 26న రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ జరగనుంది. రేషన్ షాప్ నంబర్ 008 వద్ద ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి లబ్ధిదారులు ఆధార్, పాత రేషన్ కార్డు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని కార్పొరేటర్ కోరారు.