మంచిర్యాల: 44వ డివిజన్లో పబ్లిక్ బోరు ధ్వంసం - కమిషనర్‌కు ఫిర్యాదు
మంచిర్యాల మున్సిపల్ 44వ డివిజన్లో పబ్లిక్ బోరును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి పైపులను ఎత్తుకెళ్లారు. దీనిపై మాజీ కౌన్సిలర్ అంకం మనోజ్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాజుకు ఫిర్యాదు చేశారు. ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా వెంటనే కొత్త బోరు వేయాలని ఆయన కోరారు.