ఖమ్మం రూరల్: సాగునీటి ప్రాజెక్టులపై అబద్ధాలు మానుకోండి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత పాలకుల తీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులను తామే నిర్మించామని చెప్పుకోవడం సిగ్గుచేటని, ప్రాజెక్టులపై అబద్ధాలు ప్రచారం చేయొద్దని ఆయన హితవు పలికారు.