ఉరవకొండ: వజ్రకరూరు మండల పరిధిలోని రాగులపాడు హంద్రీనీవా పంప్ హౌస్ వద్దకు హంద్రీనీవా కాలువల ద్వారా చేరిన కృష్ణాజలాలు
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల పరిధిలోని రాగులపాడు హంద్రీనీవా పంప్ హౌస్ వద్దకు హంద్రీనీవా కాలువలకు ఎత్తిపోతల పంప్ హౌస్ ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణాజలాలు వచ్చి చేరాయి. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో హంద్రీనీవా కాలువలోకి ఆరు పంపులతో ఎత్తిపోతలను చేపట్టి జీడిపల్లి రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు. మరో 24 గంటల తదుపరి జీడిపల్లి రిజర్వాయర్కు కృష్ణా జిల్లాలో చేరానున్నాయని అధికారులు పేర్కొన్నారు