యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో తిరంగా ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సుమారు 200 అడుగుల భారీ జాతీయ జెండాతో విద్యార్థులు ప్రధాన వీధులలో ప్రదర్శించారు. భారత్ మాతాకీ జై వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు చేసిన ర్యాలీ ఆకట్టుకుంది.