రాయదుర్గం: కణేకల్లు బస్టాండ్ సమీపంలో జనావాసాల మద్య చేతబడి కలకలం
కణేకల్లు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన జనావాసాల మధ్య చేతబడి సామగ్రి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నల్ల మేక తల, నల్ల కోడి తలతో యంత్ర భంధనం చేసి వాటితో పాటు నిమ్మకాయలు, కుంకుమను ఒక కవర్‌లో ఉంచి అక్కడ వదిలేశారు. అమావాస్య వేళ ఇలా చేయడం గమనించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.