గార్ల: బయ్యారం కరువుకు శాశ్వత పరిష్కారం ఇదే: సీతారామ ప్రాజెక్టు నీటి కోసం నిరసన
బయ్యారం మండలంలో కరువు నివారణకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని అందించాలని ఏఐకేఎంఎస్, న్యూడెమోక్రసీ నాయకులు ధర్నా నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు పడుతున్న ఇబ్బందులను, ప్రాజెక్టు హామీ అమలులో జరుగుతున్న జాప్యాన్ని ఎండగడుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.