కొత్తగూడెం: ఏటూరునాగారంలో గర్భిణి భార్యను హత్య చేసిన ఏఆర్ కానిస్టేబుల్
ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన గుండారపు భవాని(30)ని ఆమె భర్త, ఏఆర్ కానిస్టేబుల్ బోడ నరేందర్ హత్య చేసి గోదావరిలో పడేశాడు. బూర్గంపాడు వద్ద శుక్రవారం భవాని మృతదేహం లభ్యమైంది. భవాని ప్రస్తుతం మూడు నెలల గర్భిణి అని పోలీసులు తెలిపారు.