డిచ్పల్లి: తెలంగాణ యూనివర్సిటీలో విద్యుత్, నీటి పొదుపుపై అధికారుల కీలక ఆదేశాలు
తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్స్ లో విద్యుత్, నీటి పొదుపుపై మెస్ కమిటీలతో అత్యవసర సమావేశం జరిగింది. వృథాను అరికట్టాలని, లైట్లు, ఫ్యాన్లను అవసరమైనప్పుడే వాడాలని అధికారులు సూచించారు. ఎల్ నినో ప్రభావంతో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు.