గిద్దలూరు: గిద్దలూరు లోని మాజీ ఆర్మీ ఉద్యోగుల భవనం ముందు జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
దేశ సైనికుల సేవలు మరో లేనివని మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. శనివారం 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే అశోక రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని మాజీ ఆర్మీ ఉద్యోగుల సంఘం భవనం వద్ద జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి స్థానిక ఆర్మీ ఉద్యోగులు స్వాగతం పలికారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ఎంతో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలం మనకు ఈ స్వాతంత్రం లభించిందని. ఆర్మీ ఉద్యోగుల సేవలు వెలకట్టలేని అని అన్నారు. నియోజకవర్గంలోని ఆర్మీ ఉద్యోగుల సమస్యలపై పరిష్కారానికి తన సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు