దర్శి: తాళ్లూరు మండలంలో ద్విత్వా తుఫాన్ ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు
Darsi, Prakasam | Nov 30, 2025 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో ద్విత్వా తుఫాన్ ప్రభావంతో తేలికపాటి వర్షాలు మొదలయ్యాయని స్థానికులు తెలిపారు. కోతకు వచ్చిన పంటల రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఎత్తైన భవనాలు టవర్ల వద్ద చెట్ల కింద ఉండవద్దని హెచ్చరించారు. తుఫాను కారణంగా అధికారులందరినీ అప్రమత్తం చేశామని ఎమ్మార్వో తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చిన వెంటనే తెలియజేయాలని పేర్కొన్నారు.