గుమ్మడిదల: గుమ్మడిదల పశు వైద్యశాల అభివృద్ధి పనులు వేగవంతం
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని పశు వైద్యశాల అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. న్యూ ల్యాండ్ పరిశ్రమ సహకారంతో చేపట్టిన ఈ పనుల ద్వారా పశువులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని అధికారులు తెలిపారు.