ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో శుక్రవారం పేకాట స్థావరం పై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 16 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3,18,086 నగదును 21 మోటర్ సైకిళ్లు,19 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నార. దర్శి డిఎస్పీ లక్ష్మి నారాయణ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నూజెండ్ల, శంకరాపురం గ్రామాల మధ్య పొలాలలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో తాళ్లూరు, ముండ్లమూరు పోలీస్ సిబ్బంది సహాయంతో పేకాట స్తావరం పై దాడి చేశామని తెలిపారు. వీరిపై కేసు నమోదుచేసి కోర్ట్ కి హాజరుపరచనున్నట్లు అయన తెలిపారు.