రామచంద్రపురం: కె.గంగవరం జడ్పీటీసీ అభ్యర్థిగా చింతా అనురాధ నామినేషన్
రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం జడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా చింతా అనురాధ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ముఖ్య నాయకులు, కార్యకర్తల భారీ ర్యాలీతో ఆమె నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.