సంగారెడ్డి: సంగారెడ్డిలో మూలనపడ్డ 5 చెత్త సేకరణ ఆటోలు; మరమ్మతులు చేయని అధికారుల నిర్లక్ష్యం
సంగారెడ్డి మున్సిపాలిటీకి చెందిన 5 చెత్త సేకరణ ఆటోలు రాజంపేట ఫిల్టర్ బెడ్ వద్ద నిరుపయోగంగా పడి ఉన్నాయి. స్వల్ప మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వస్తాయని తెలిసినా, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేయించి ఆటోలను అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.