జిన్నారం: సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం ల్యాబ్‌లో గ్యాస్ లీకేజీ: ఇద్దరు కార్మికుల మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలోని సరాక ల్యాబొరేటరీస్‌లో క్లోరోఫామ్ గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పైప్‌లైన్ వాల్వు నుంచి గ్యాస్ లీక్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు అందింది.