జిన్నారం: సంగారెడ్డి: సరాక పరిశ్రమలో గ్యాస్ లీకేజీ.. ఇద్దరు కార్మికులు మృతి
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం సరాక పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు 70 లక్షల రూపాయల పరిహారం, అంత్యక్రియలకు లక్ష రూపాయల సాయం అందించేలా ఒప్పందం కుదిరింది.