తొర్రూర్: తొర్రూరు: ప్రిన్సిపాల్ బదిలీపై రోడ్డు ఎక్కిన విద్యార్థులు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల ప్రిన్సిపాల్ శంకర్ బదిలీని నిరసిస్తూ విద్యార్థులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. తమకు ప్రిన్సిపాల్‌ను తిరిగి నియమించాలని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు గేట్లు తీసి విద్యార్థులను బయటకు పంపడంతో వారు నిరసనలో పాల్గొన్నారు.