కొండపి: టంగుటూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించిన జిల్లా ఎస్పీ దామోదర్
ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్ ను శనివారం జిల్లా ఎస్పీ దామోదర్ ఆకస్మికంగా తనిఖీ చేసి సందర్శించారు. స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించి క్రైమ్ రిపోర్ట్ పై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలు బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగటం డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్మూలించే అంశంలో పోలీసు సిబ్బందికి ఎస్పి సూచనలు సలహాలు ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు డ్రోన్ సహాయంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చెక్ పెట్టాలన్నారు. తర్వాత పోలీసు సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.